ఖాళీ గుంత నుండి మొదలుపెట్టి, ఒక గుంతను విడిచి, తర్వాతి ఖాళీ గుంతలోకి గెంతాలి. ఈ మూడు గుంతలూ తిన్నగా ఒకే గీతపై ఉండాలి. గెంతు పూర్తయితే గుంతలో గోళీని నింపినట్టు. ఆలా, ఒకటి తప్ప అన్ని చోట్లా గోళీలు నింపితే, మీరు గెలిచినట్టు!
ఖాళీ గుంతను నొక్కగానే, అక్కడి నుండి మీరు చేరుకొని గోళీ వేసే గుంతలు పచ్చరంగులో వెలుగుతాయి. పచ్చరంగు గుంతను నొక్కితే, అందులో గోళీ నిండుతుంది. ఎర్రరంగు గుంతను నొక్కి ఎత్తు రద్దుచేసుకోవచ్చు.
ఎత్తుల ద్వారా చేరుకోగలిగే ఖాళీ గుంతలు లేకపోతే, ఆటకట్టు!
ఎప్పుడో ఈ చిక్కుముడిని తయారుచేసినవారికి!
మా నాన్నకి
పదిహేనేళ్ళ క్రితం ఈ చిక్కుముడిని నాతో ఆడించినందుకు.
మా బుడ్డోడికి
డిజిటల్ రూపం తయారీలో సూచనలకు. దీన్ని పరీక్షించినందుకు.
మొజిల్లా, W3C
స్వేచ్ఛా, బహిరంగ జాల సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నందుకు
ఓపెన్గేమ్ఆర్ట్.ఆర్గ్
ఆటలో వాడిన చెక్క బొమ్మ, నాణెం చప్పుడులకు.
అప్పాజీ అంబరీష దర్భా
దీనిలో వాడిన పెద్దన తెలుగు ఖతికి.
ప్రోత్సహిస్తున్న మిత్రులకు; ఈ ఆటను తోటివారితో పంచుకున్న వారందరికీ!
♥తో మీ వీవెన్